మూడేళ్లు కఠోరంగా శ్రమించి ధరణి పోర్టల్ తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. గతంలో 'వీఆర్వో రాసింది రాత.. ఎమ్మార్వో గీసింది గీత' అని సీఎం వెల్లడించారు. గతంలో కలెక్టర్, ఆర్డీవో దగ్గర రికార్డులు ఉండేవి కావని... భూరిజిస్ట్రేషన్లలో ఎన్నో అక్రమాలు జరిగేవన్నారు. ఎంతో దూరం వెళ్లి లంచాలు పెట్టి, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే వారని ఆయన పేర్కొన్నారు.
ధరణి రైతులకు వరం... పైరవీకారులకు ఆశనిపాతం: సీఎం - telangana varthalu
ధరణి పోర్టల్ వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి రైతులకు వరంగా మారిందని సీఎం స్పష్టం చేశారు.
ఇప్పుడు పావుగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. లక్షా 8 వేల పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్వల్పకాలంలోనే ధరణి పోర్టల్ ద్వారా 3 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. కోటి 53 లక్షల ఎకరాలు ధరణి పోర్టల్లో రికార్డయ్యాయని వెల్లడించారు. ధరణి పోర్టల్ పేదలకు వరంగా మారిందని స్పష్టం చేశారు. ధరణి రైతులకు వరం.. పైరవీకారులకు ఆశనిపాతమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఇదీ చదవండి: మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విజయవంతమైన పథకాలు: సీఎం