దళిత బంధు చూసి కొందరికి బీపీ పెరుగుతోందని సీఎం కేసీఆర్(KCR) అన్నారు. దళిత బంధు చూసి బీపీ పెంచుకునే వారి ధ్యాసంతా ఓటు పైనే అని విమర్శించారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయని.. హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చామంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాజకీయంగా లాభం జరగాలని కోరుకుంటే.. తప్పేముందని కేసీఆర్ ప్రశ్నించారు. పని చేసిన వాడు.. ఫలితం కోరుకోవద్దా? అని అన్నారు. తెరాస సన్నాసుల మఠం కాదని.. రాజకీయ పార్టీ అని ఉద్ఘాటించారు.
హుజూరాబాద్ నియోజకవర్గం దళిత బంధుకు ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. నిన్న ఒగైన నాతో అన్నడు. అడ ఎలక్షన్ ఉన్నదని గందుకే దళిత బంధు పెట్టిర్రని... ఎందుకు పెట్టం వయ్యా... తెరాస ఏమన్న సన్నాసుల మఠమా.. తెరాస రాజకీయ పార్టే కాదా.. రాజకీయకంగా లాభం జరగాలని కచ్చితంగా కోరుకుంటాం.
-కేసీఆర్, సీఎం