తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరం వ్యయంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం' - కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని సీఎం కేసీఆర్​ విమర్శించారు. గోదావరి జలాల పూర్తి వినియోగానికి ఉన్న ఏకైక మార్గం కాళేశ్వరమేనని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు

By

Published : Jul 18, 2019, 3:30 PM IST

Updated : Jul 18, 2019, 10:58 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యయంపై కూడా విపక్షాలు అనవసరంగా విమర్శిస్తున్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. కొన్నిసార్లు ఖరీదైన వ్యవహారం అయినప్పటికీ భౌగోళిక పరిస్థితులు దృష్ట్యా ఉన్న వనరులనే ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యుత్​ బిల్లులకు భయపడితే గోదావరి నుంచి నీటిని పొలాలకు అందించలేమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు ప్రాజెక్టుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరెంత వ్యతిరేకించినా... రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ సర్కారు పనిచేస్తోందని తెలిపారు.

కాళేశ్వరం విద్యుత్​ బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది
Last Updated : Jul 18, 2019, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details