CM KCR Speech at Golconda Fort : 77వ స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్.. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం.. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మొదట రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు.
CM KCR Speech at 77th Independence Day Celebrations : దేశ భక్తి పెంచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల ప్రగతి ఘనమే అయినా ఇంకా చేయాల్సింది ఉందన్న సీఎం.. పాలకుల అసమర్థత, భావదారిద్య్రం వల్ల సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేదరికం, అసమానతలు ఇంకా తొలగిపోలేదన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించిన రోజే నిజమైన స్వాతంత్యం వచ్చినట్టని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఘోరమైన వివక్ష ఎదుర్కొందన్న కేసీఆర్.. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం తలచుకుంటే ఇప్పటికీ దుఃఖం పొంగుకొస్తుందన్నారు.
'గతంలో ఎటుచూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. పడావు పడ్డ భూములు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా నిర్వహించాం. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించాం. అనతి కాలంలోనే తెలంగాణ తిరుగులేని విజయాలు సాధించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాం. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందనే పేరు తెచ్చాం. నేడు తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. పంట కాలువలతో.. పచ్చని చేలతో కళకళలాడుతోంది. కాళేశ్వరం(Kaleshwaram)జీవధారలతో సస్యశ్యామలం అవుతోంది.'-ముఖ్యమంత్రి కేసీఆర్
Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ