తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి మానుకోవాలి' - ప్రతిపక్షాలపై కేసీఆర్ వ్యాఖ్యలు

కొవిడ్​ వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ప్రతిపక్ష వ్యాఖ్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి మాని... వాస్తవంలోకి వచ్చి సహకరించాలని సూచించారు.

cm-kcr-serious-on-oppositions-at-assembly-mansoon-session-2020
'ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి ప్రతిపక్షం మానుకోవాలి'

By

Published : Sep 9, 2020, 3:44 PM IST

ప్రతిపక్షం చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు లేరని భట్టి చేసిన వ్యాఖ్యాలను సీఎం ఖండించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,824 మంది వైద్యులను భర్తీ చేసినట్లు తెలిపారు. 2014వ సంవత్సరం వరకు వైద్యులను తక్కువగా ఉంచింది ఎవరో ప్రతిపక్షాలే తెలుసుకోవాలన్నారు.

''ఒక్కొక్కరిది ఒక్కో మాట..

కరోనా వైరస్​ గురించి ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఒకరు ఇది జీవితకాలం ఉంటుంది అంటే.. మరొకరు ఇది 10 పది సంవత్సరాల వరకు ఉంటుంది అంటున్నారు. రష్యా వాళ్లు వ్యాక్సిన్ కనిపెట్టాము అంటే.. తక్కువ సమయంలో ఎలా చేశారు. అది పనిచేయదు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో ప్రజలు అర్థంకాక సతమతమవుతున్నారు. ఈ ఉత్పాతం నుంచి సమాజాన్ని బయటకు పడేయాలి. దీనికి ప్రతిపక్ష నాయకులు కూడా సహకరించాలి.

వారసత్వంగా వచ్చాయి...

తెలంగాణ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లులేవు. ఆక్సిజన్ లేని బెడ్లు అన్ని ప్రతిపక్షం నుంచే వారసత్వంగా మాకు వచ్చాయి. 50-60 ఏళ్లు వాళ్ల ప్రభుత్వమే పాలించింది. భారత దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలే వెనుకబడి ఉంటే... మీరు రాష్ట్రాన్ని ఇంకా వెనుకబడేలా చేశారు. మీ నుంచి మాకొచ్చిన వారసత్వమే ఇది. కరోనా కట్టడి విషయంలో ప్రతిపక్షాలను కలిసే ప్రసక్తే లేదు. ప్రతిపక్షం అంత హుందాగా, గౌరవంగా ప్రవర్తిస్తే ఏమైనా మాట్లాడే అవకాశముండేది. ''

-కేసీఆర్, ముఖ్యమంత్రి

'ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి ప్రతిపక్షం మానుకోవాలి'

ఇదీ చూడండి:కరోనా పరిస్థితిని సీఎం నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నారు: ఈటల

ABOUT THE AUTHOR

...view details