కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈనెల 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్ కొనసాగుతుందని, ఆ తరువాతనే అవసరాల మేరకు సడలింపులు ఉంటాయని చెప్పారు. లాక్‌డౌన్, పేదలకు సాయంలో ప్రజాప్రతినిధుల చొరవ, ప్రజల సహకారం కొనసాగాలని సూచించారు.
ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధం: కేసీఆర్ - కరోనా
తెలంగాణలో ఎంతమందికైనా కరోనా పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
CM KCR serious comments on Carona virus
ఎంత మందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. కొవిడ్-19 వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.