తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి విషయంలో బేసిన్లు, భేషజాలు లేవు: కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే నదీ జలాలను వాడుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ఏపీ నీటిపారుదల శాఖ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఆయన.. నీటి వాటాలపై తనకు స్పష్టత ఉందన్నారు.

cm kcr said We have clarity regarding water shares in telangana
నీటి వాటాలకు సంబంధించి మాకు స్పష్టత ఉంది

By

Published : May 18, 2020, 10:12 PM IST

నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించి ప్రాజెక్టులు కట్టలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నీటి విషయంలో తనకు అవగాహన ఉందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. నీటి విషయంలో బేసిన్లు, భేషజాలు లేవని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకే నదీ జలాలను వాడుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.

వేటిని లేవనెత్తాలో కూడా

పోతిరెడ్డిపాడు మీద భయంకరంగా పోరాడింది ఎవరని సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు విషయాలు వేటిని లేవనెత్తాలో కూడా తెలియట్లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సీఎంలకు చెంచాగిరి చేసిందెవరో తెలియదా అని అన్నారు. చట్ట పరిధిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

ఏం సాధించారు

చంద్రబాబు మాట్లాడితే బస్తీమే సవాల్ అన్నారు.. ఏం సాధించారని ప్రశ్నించారు. మహారాష్ట్ర మీదకు బాబ్లీ అని చంద్రబాబు పంచాయితీ పెట్టారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రతో సత్సంబంధాలతో నీళ్లు సాధించానన్నారు. రాయలసీమకు నీళ్లు అవసరమైతే గోదావరి నుంచి తీసుకుని వెళ్లమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. మిగులు జలాలు ఉన్న గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

నీటి వాటాలకు సంబంధించి మాకు స్పష్టత ఉంది

ఇదీ చూడండి :చెప్పిన రకం వరి వేయకపోతే... రైతుబంధు వర్తించదు

ABOUT THE AUTHOR

...view details