"1962 నుంచి 2013 వరకు వక్ఫ్ భూముల సర్వేలు చేశారు... గెజిట్లు ఇచ్చారు. వక్ఫ్ భూములు 55 వేల ఎకరాలు, 87 వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. దేవాదాయ, వక్ఫ్ భూములు రక్షిస్తాం. రేపటి నుంచే వక్ఫ్ భూముల్లో లావాదేవీలు నిషేధం.
అటవీ భూముల్లోనూ రాజకీయదందానే చేశారు. వక్ఫ్‌భూముల రిజిస్ట్రేషన్లు, గ్రామపంచాయతీ, పురపాలికల్లో అనుమతులు నిలిపివేస్తాం. ధరణి పోర్టల్లో అటవీ భూములకు ప్రత్యేక కాలమ్ ఉంటుంది. ఆర్వోఎఫ్‌ఆర్ భూములు రక్షిస్తాం. ఇప్పటికే పట్టాలు పొందిన గిరిజనుల జోలికి వెళ్లం."