10lakh New pensions in telangana:ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు కానుక ప్రకటించారు. రాష్ట్రంలో 57ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి పింఛన్లు అందజేయనున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రస్తుతం 36లక్షల పింఛన్లు ఉన్నాయని, స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని కొత్తగా మరో 10లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
గుడ్‌న్యూస్... కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు.. ఎప్పటినుంచంటే! - cm kcr on new pensions in telangana
17:13 August 06
కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నాం: సీఎం
ఆగస్టు 15 నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, వీరికి కొత్తగా బార్‌కోడ్‌తో కూడిన పింఛను కార్డులు ఇస్తామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని జైళ్లశాఖను ఆదేశించినట్టు సీఎం తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులకు కూడా పింఛన్లు ఇస్తున్నామని, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకునే రోగులకు కూడా పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఇదీ చూడండి: నీతిఆయోగ్‌లో పల్లికాయలు బుక్కుడు తప్ప.. చేసేదేం లేదు: కేసీఆర్