రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వరదల కారణంగా హైదరాబాద్‌లో రూ.8 వేల కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదిక పంపామని చెప్పారు. పరిహారం కింద కేంద్రం పైసా కూడా ఇవ్వలేదని(kcr about central government) పేరొన్నారు. వరదలు వస్తే ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. నష్టం అంచనాలపై రెండు రకాల నివేదికలు పంపుతారని చెప్పారు. తక్షణ సహాయం కోసం తాత్కాలిక నివేదిక ఇస్తారన్నారు.
'అంతా బోగస్'
ఫసల్ బీమా లేదా మరొకటి ఏదైనా అంతా బోగస్ అని, కేంద్రం పెట్టిన విధానాలే సరిగా లేవని ఆరోపించారు. దేశంలో ఫసల్ బీమా యోజన శాస్త్రీయంగా లేదని, ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదని తెలిపారు. కేంద్రాన్ని తాము విమర్శించడం... కేంద్రం తమను మమ్మల్ని విమర్శించడం సరికాదని(kcr about central government) హితవు పలికారు. ప్రపంచ దేశాలు వీటిని అధిగమించి పురోగతి సాధించాయిని గుర్తుచేశారు.
హైదరాబాద్ సిటీలో వరదలు వచ్చాయి. చాలా నష్టం జరిగింది. అనేకమంది శాసనసభ్యులు చెప్పారు. హైదరాబాద్, వివిధ పట్టణాల్లో మొత్తం రూ.8వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపాం. కేంద్రం ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలేదు. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే కేటాయింపుల్లో ఇంకో పద్దు ఉంటుంది. ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తే కూడా కొంత డబ్బు అందుబాటులో ఉండాలి. అది అన్ని రాష్ట్రాలకు ఇస్తారు. బడ్జెట్లోనూ ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వెంటనే తాత్కాలిక అంచనా పంపిస్తుంది. కేంద్రం వెంటనే డబ్బులు ఇవ్వదు. కేంద్ర బృందాన్ని పంపిస్తుంది. మన హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు వాళ్లు రానేలేదు.
-సీఎం కేసీఆర్