"అందరి క్షేమం కాంక్షించే మా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. కరోనాతో ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదు. సంక్షేమ పథకాల్లో తెలంగాణకు సాటి ఎవరూ లేరు. గాలివాటంగా ఓటు వేయొద్దనే మా పథకాలు ప్రజల ముందుంచాం.
మా ప్రభుత్వం వచ్చాకే హైదరాబాద్‌కు సౌకర్యాలు కల్పించాం. వరద బాధల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కల్పిస్తాం. వరద కష్టాల విముక్తికి ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలతో హైదరాబాద్‌లో కాలుష్యం తగ్గిస్తాం. మూసీ నదిని గోదావరితో అనుసంధానిస్తాం. ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా అమలు చేస్తున్నాం. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు అందిస్తాం. యావత్ నగర ప్రజల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరికీ రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం మీ ముందుంది. కేసీఆర్ కిట్ సూపర్ హిట్."
రైతు బంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా: కేసీఆర్
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఎల్బీ స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. గడిచిన ఆరేళ్లలో రాష్ట్రంలో అమలు పరిచిన పథకాల గురించి సీఎం వివరించారు. మేం ఇస్తున్న రైతుబంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
రైతు బంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా: కేసీఆర్
- సీఎం కేసీఆర్
ఇదీ చూడండి :చైతన్యవంతులు అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్