పీవీ నరసింహారావు.. గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయ ప్రస్థానంలో కుల, ధన బలం పార్శ్వమే లేదని తెలిపారు. ఆయన తెచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయని తెలిపారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనుకున్నదే తడువుగా ఏదైనా సరే నేర్చుకునే నిరంతర విద్యార్థి అని పేర్కొన్నారు. సహాయకులున్నా స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసిన వ్యక్తి అని చెప్పారు. నిరంతర విద్యార్థి.. అధ్యయనశీలి.. సామాజిక దృక్పథం గల వ్యక్తి పీనీ అని కేసీఆర్ వెల్లడించారు.
'కుల, ధన బలం లేకుండానే సీఎం, ప్రధాని అయ్యారు' - పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు
కుల, ధన బలం లేకుండానే పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నిరంతర సంస్కరణశీలిగా ఉన్న ఆయన గొప్ప అభ్యుదయవాది అని కొనియాడారు. పీవీ ఆశయాల మేరకు 900 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం పాల్గొని నివాళులర్పించి ప్రసంగించారు.
'కుల, ధన బలం లేకుండానే సీఎం, ప్రధాని అయ్యారు'
విషయాన్ని విశ్లేషణ చేసుకునే నేర్పరితనం ఆయనలో ఉందని సీఎం వివరించారు. పీవీ 'వేయి పడగలు' నవలను హిందీలోకి తర్జుమా చేశారు, నవలను అనువాదం కాకుండా.. అనుసృజన చేశారని మెచ్చుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పాల్గొని నివాళులర్పించి ప్రసంగించారు.
ఇదీ చూడండి :360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ : కేసీఆర్