తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం : కేసీఆర్​ - National Panchayati Raj Day 24 April

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలియజేశారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందనేది నిజమని పునరుద్ఘాటించారు. గాంధీజీ కలలుకన్న ఆదర్శాల అమలు వాస్తవ రూపం దాలిస్తేనే గ్రామాలు నిజమైన అభివృద్ధికి నోచుకుంటాయని స్పష్టం చేశారు.

cm kcr said panchayat raj Awards, cooperation of the people in telangana
ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థకు అవార్డులు: కేసీఆర్​

By

Published : Apr 24, 2021, 3:41 PM IST

Updated : Apr 24, 2021, 4:46 PM IST

పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్... రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరగాలన్న ఎస్కేడే ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యం

ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినపుడే, ప్రజల సహకారంతోనే పాలనావ్యవస్థ ప్రగతిపథంలో ముందడుగు వేస్తుందని అన్నారు. భారతదేశంలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలన్న మహోన్నత లక్ష్యంతో... నాటి సోషల్ ఇంజినీర్​గా ప్రసిద్ది పొందిన సురీందర్ కుమార్ డే పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ చేశారని కేసీఆర్ అన్నారు. ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే స్వయం సహకార ఉద్యమంలో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ మనదేశంలో రూపుదిద్దుకొందని గుర్తు చేశారు.

అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి

తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం దేశ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్​ అన్నారు. ఎవరి గ్రామాన్ని వారే తీర్చిదిద్దుకునేలా ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ పల్లెల్లో పాలనా వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపారు. ప్రతినెలా పల్లెల అభివృద్దికి రూ.339 కోట్లు, పట్టణాల అభివృద్ధికి రూ.148 కోట్లు క్రమం తప్పకుండా అందిస్తున్నామని చెప్పారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సహా ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదాన్ని సంతరించుకుని అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ముందంజలో తెలంగాణ

దేశంలో మరే రాష్ట్రం అందుకోని విధంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలచే 13 జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతోందనడానికి ఈ అవార్డులు, ప్రశంసలే నిదర్శనమని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితోపాటు... గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సబ్బండ వర్గాలను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తున్నాయని చెప్పారు. తద్వారా నాడు ఎస్కేడే కలలు కన్న పంచాయతీరాజ్ సహకార వ్యవస్థ లక్ష్యాలను సాధించడంలో... తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇదీ చూడండి :అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

Last Updated : Apr 24, 2021, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details