పోలీసు అమలవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విధుల నిర్వహణలో అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం పోలీసులు చేసిన అత్యున్నత త్యాగాలను ప్రజలు, దేశం ఎప్పటికీ మరచిపోలేదన్నారు.
పోలీసుల త్యాగాలు అజరామరం, అనిర్వచనీయం: సీఎం కేసీఆర్ - పోలీసులపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
"పౌరుల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. పోలీసులు చేసిన త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. అమరవీరులు చూపిన ఆదర్శాలను పోలీసు బలగాలు అనుసరించాలి. అమరుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది." -సీఎం కేసీఆర్
పోలీసుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు: సీఎం కేసీఆర్
పోలీసు అమరవీరులు చూపించిన ఉన్నతమైన ఆదర్శాలను పోలీసు బలగాలు అనుసరించాలని కేసీఆర్ సూచించారు. అమరుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.
ఇదీ చదవండి:అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ