తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​ - సద్దుల బతుకమ్మ వేడుకలు

CM KCR BATHUKAMMA WISHES: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మను ఘనంగా జరుపుకోవడానికి చేపట్టిన చర్యలు ఫలించాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు.

CM KCR SADDULA BATHUKAMMA WISHES
CM KCR SADDULA BATHUKAMMA WISHES

By

Published : Oct 3, 2022, 6:48 AM IST

CM KCR BATHUKAMMA WISHES: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటాపాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయన్నారు.

ఈ సందర్భంగా విజయాలను అందించే విజయదశమిని స్వాగతిస్తూ.. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని సీఎం తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించేలా దీవించాలని మరోసారి అమ్మవారిని కేసీఆర్ ప్రార్థించారు.

ABOUT THE AUTHOR

...view details