రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 7న సమీక్ష నిర్వహించనున్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో... బుధవారం ఉదయం పదకొండున్నరకు విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, స్మగ్లింగ్ అరికట్టడం, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం - సీఎం కేసీఆర్ లేటెస్ట్ న్యూస్
శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
12:08 October 05
శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
ఈ సమావేశంలో హోం మంత్రి మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖల కార్యదర్శులు, డీజీపీ, అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొనున్నారు.
ఇదీ చదవండి:ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
Last Updated : Oct 5, 2020, 1:17 PM IST