కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈటల, సీఎస్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు, తదితర అంశాలపై చర్చించారు. వైద్యశాఖ అధికారులు తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇవాళ 3 కేసులే నమోదు కావడం, 40 మంది కోలుకోవడం శుభసూచకమన్నారు. బాధితుల్లో హైదరాబాద్, దాని పరిధిలోని మరో 3 జిల్లాల వారే అధికమని ఆధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్డౌన్ కట్టుదిట్టం చేయాలని సీఎంకు వివరించారు. ఆ నాలుగు జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఇతర జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడంతో పాటు కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గిందని సీఎంకు అధికారులు తెలిపారు.
కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు 40 రైళ్లు: సీఎం కేసీఆర్ - cm kcr review
కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ నిబంధనల సడలింపు, తదితర అంశాలపై చర్చించారు. ఇవాళ 3 కేసులే నమోదు కావడం శుభసూచకమన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.

వలస కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యేక రైళ్ల ద్వారా కార్మికులను స్వస్థలాలకు చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కార్మికులను తరలించేందుకు 40 రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మంగళవారం నుంచి వారం పాటు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. బిహార్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబంగాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పలు పీఎస్‌లలో కూలీలు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారిని రైళ్ల ద్వారా తరలిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కూలీలు ఆందోళన చెందవద్దని... తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ ఏర్పాట్లను కూలీలకు వివరించాలని పోలీసులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్‌డౌన్‌పై మంగళవారం మంత్రివర్గ భేటీ