హైదరాబాద్ ప్రగతి భవన్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎన్నికపై చర్చించారు.
పరిస్థితులను సమీక్షించుకొని ముందుకెళ్లాలి: కేసీఆర్ - తెలంగాణ వార్తలు
కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు, ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ జిల్లాల మంత్రులతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.
పరిస్థితులను సమీక్షించుకొని ముందుకెళ్లాలి: కేసీఆర్
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాల్లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటికి అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి'