తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2021, 4:57 AM IST

Updated : Jan 24, 2021, 6:50 AM IST

ETV Bharat / state

సాగుపై ప్రత్యేక శ్రద్ధ.. నేడు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

cm-kcr-review-today-on-crop-cultivation-and-marketing-related-issues
సాగుపై ప్రత్యేక శ్రద్ధ.. నేడు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

రాష్ట్రంలో పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు, ప్రాంతీయ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ప్రగతిభవన్ వేదికగా జరగనున్న సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో సాగు చేయాల్సిన పంటలు, అవలంభించాల్సిన విధానం, వాటి మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చిస్తారు. సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వరి పెద్ద మొత్తంలో సాగవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు సాధ్యం కాదని అధికారులు, నిపుణులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ ఏడాది అమలు చేసిన నియంత్రిత సాగు విధానం కూడా అవసరం లేదని, రైతులకు నచ్చిన పంట వేసుకోవడమే మేలన్నారు. ఈ పరిస్థితుల్లో పంటల సాగు, ప్రభుత్వ పరంగా అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చిస్తారు. చాలా క్లస్టర్లలో రైతు వేదికలు ప్రారంభమయ్యాయి. మిగతా వాటి పనులు కూడా పూర్తి చేస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో పంటల సాగు, మార్కెటింగ్ విషయమై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

Last Updated : Jan 24, 2021, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details