తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై రెండోరోజు కేసీఆర్ సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మరోమారు సమావేశమయ్యారు. సునీల్ శర్మ కమిటీ తయారుచేసిన నివేదికను సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు.

ఆర్టీసీపై మరోసారి ప్రారంభమైన కేసీఆర్ సమీక్ష

By

Published : Oct 7, 2019, 4:47 PM IST

Updated : Oct 7, 2019, 6:42 PM IST

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానం ఖరారు దిశగా కసరత్తు వేగవంతమైంది. మంత్రులు పువ్వాడ అజయ్‌, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు సోమేష్‌కుమార్‌ , సునీల్ శర్మ, సందీప్‌ కుమార్ సుల్తానియా, రవాణా, ఆర్టీసీ అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

సీఎం ముందు సునీల్ శర్మ కమిటీ రిపోర్ట్

నిన్నటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అద్దె బస్సులు, కొత్త సిబ్బంది నియామకం ప్రైవేటు సర్వీసులకు రూట్ పర్మిట్‌ల అంశాలపై సునీల్ శర్మ నేతృత్వంలోని కమిటి నివేదిక సిద్దం చేసింది. రవాణా, ఆర్టీసీ అధికారులతో చర్చించి సంబంధిత అంశాలపై నివేదిక రూపొందించింది. అద్దె బస్సులకు నోటిఫికేషన్ భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు, ప్రైవేటు సర్వీసులకు అనుమతుల విషయమై కమిటీ ఇచ్చిన నివేదికపై సమావేశంలో చర్చిస్తున్నారు. వాటి ఆధారంగా ఆర్టీసీకి సంబంధించిన సమగ్ర విధానాన్ని రూపొందిస్తారు.

​​​​​​​

ఆర్టీసీపై రెండోరోజు కేసీఆర్ సమీక్ష

ఇదీ చదవండిః అధికారులతో ఆర్టీసీ ఎండీ భేటీ..

Last Updated : Oct 7, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details