తెలంగాణ

telangana

ETV Bharat / state

కాసేపట్లో ఆర్టీసీపై మరోసారి కేసీఆర్ రివ్యూ - ఆర్టీసీపై మరోసారి కేసీఆర్ రివ్యూ

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మరోమారు సమావేశం కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

ఆర్టీసీపై మరోసారి కేసీఆర్ రివ్యూ

By

Published : Oct 7, 2019, 1:12 PM IST

ఆర్టీసీ సమ్మె, ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్షించనున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కాసేపట్లో మంత్రులు, అధికారులతో మరోమారు చర్చించనున్నారు. నిన్నటి సమావేశ నిర్ణయాలకు కొనసాగింపుగా ఇవాళ సమీక్ష సాగనుంది. జిల్లాల్లో మూడో రోజు కూడా సగానికి పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా అద్దెబస్సుల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి అధికారులతో మాట్లాడనున్నట్లు సమాచారం. ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు, కొత్త సిబ్బంది నియామకం వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఆర్టీసీపై అధ్యయన వివరాలను సునీల్ శర్మ కమిటీ సీఎంకు వివరించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details