ముఖ్యమంత్రి కేసీఆర్.. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సమావేశమైన సీఎం.. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 10 లక్షల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు.
సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీరు: కేసీఆర్ - సీతారామ ప్రాజెక్టు వార్తలు
సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లతో సమావేశమైన సీఎం.. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
![సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీరు: కేసీఆర్ cm kcr review on sitarama project in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10326262-thumbnail-3x2-kcr.jpg)
సీతారామతో 10 లక్షల ఎకరాలకు నీరు: కేసీఆర్
దుమ్ముగూడెం పాయింట్ వద్ద గోదావరిలో ఏడాది పొడవునా నీరు ఉంటుందన్నారు. దుమ్ముగూడెం నుంచి పాలేరు జలాశయానికి నీళ్లు తరలించాలని అధికారులకు సూచించారు. లిఫ్టులు, కాల్వల ద్వారా పాలేరుకు నీళ్లు తీసుకెళ్లాలని చెప్పారు. సత్తుపల్లి, ఇల్లందువైపు కాల్వలకు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. సత్తుపల్లి, ఇల్లందువైపు కాల్వల పనులకు టెండర్లు పిలవాలని అధికారలుక కేసీఆర్ స్పష్టం చేశారు.