ఆర్టీసీ సమ్మె కొనసాగింపు, హైకోర్టు వరుస విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై దాదాపు రెండున్నర గంటలపాటు సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ జోషి, అధికారులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌తో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు విజ్ఞప్తి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. అలాగే 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ తదుపరి ముందుకెళ్లారాదన్న కోర్టు ఆదేశాలపై కూడా సమీక్షించారు. రెండింటికి సంబంధించిన తీర్పు ప్రతులను అధ్యయనం చేయడంతో పాటు కోర్టు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. కోర్టు ముందు ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలపై ముఖ్యమంత్రి సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం.
ఆర్టీసీపై సీఎం సమీక్ష... హైకోర్టు వ్యాఖ్యలపై కీలకచర్చ - CM KCR Review on RTC Strike today news
CM KCR Review on RTC Strike
18:53 November 08
ఆర్టీసీపై సీఎం సమీక్ష... హైకోర్టు వ్యాఖ్యలపై కీలకచర్చ
Last Updated : Nov 8, 2019, 11:00 PM IST
TAGGED:
CM KCR Review on RTC Strike