CM Review Meeting: పల్లెప్రగతి, పట్టణప్రగతితో పాటు ధాన్యం సేకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం, వైకుంఠధామాలు, ప్రకృతివనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, నగరపాలికల మేయర్లు, కమిషనర్లతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశం కానున్నారు.
CM Review Meeting: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై రేపు సీఎం సమీక్ష
CM Review Meeting: రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి వర్గం, అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు. బృహత్ ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పురోగతినిని కూడా సీఎం సమీక్షిస్తారు. యాసంగి సీజన్‌కు సంబంధించి కొనసాగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియపైనా నేతలు, అధికారులతో చర్చిస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కూడా చర్చ జరగనుంది. వీటితో పాటు ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: