రాజధానిలో నిర్మించనున్న కొత్త సచివాలయం సకల సౌకర్యాలతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సులువుగా విధులు నిర్వహించడానికి వీలుగా వసతులను కల్పించాలన్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల కార్యాలయాలనూ అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నారు. అధికారులు, ఉద్యోగులు భోజనం చేసేందుకు అనుకూలంగా ప్రతి అంతస్తులోనూ భోజన శాల (డైనింగ్ హాలు), సమావేశమందిరం, సందర్శకుల కోసం నిరీక్షణ మందిరం (వెయిటింగ్ హాల్), అన్ని వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం ఉండేలా నిర్మాణం ఉండాలని చెప్పారు. నూతన సచివాలయ నిర్మాణంపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సచివాలయానికి సంబంధించిన ఆకృతుల (డిజైన్లు)ను పరిశీలించారు. గతంలో ఆర్కిటెక్ట్‌లు భవన సముదాయం నమూనాను సమర్పించగా... తాజాగా భవన సముదాయం ప్రాంగణంలో పచ్చికబయళ్లతో కూడిన ఆకృతిని చూపించారు.
సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్
13:47 July 29
నూతన సచివాలయంపై సీఎం కేసీఆర్ సమీక్ష
అనంతరం వాటిల్లో పలు మార్పులను ఆయన సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, రోడ్లు-భవనాల శాఖ ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, అధికారులు సతీష్, మధుసూదన్‌రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ నిపుణులు ఆస్కార్ పొన్ని పాల్గొన్నారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు