'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి' - CM KCR Today news
19:17 December 07
'రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి'
హైదరాబాద్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖపై సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్రమంత్రుల మాటలకు, వాస్తవాలకు పొంతన లేదని సీఎం వ్యాఖ్యనించారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్లు తగ్గిందని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గినందున అన్నిశాఖలకు నిధులు తగ్గించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఖర్చులపై అన్ని శాఖల్లోను స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర వివరాలతో నివేదికను ఈ నెల 11న జరిగే మంత్రివర్గ భేటీలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి సీఎం లేఖరాశారు. కేంద్ర నిధుల కోసం ప్రధానిని కలిసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.