CM KCR: దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - telangana varthalu
17:01 August 12
దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ మరోసారి ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఎస్సీలకు ఇప్పటికే దళితబంధు నిధులు మంజూరైన నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. 76 ఎస్సీ కుటుంబాలకోసం యాదాద్రి జిల్లా కలెక్టర్ ఖాతాలో ఇప్పటికే 7 కోట్ల 60లక్షల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసింది.
లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎలా వాడుకోవాలనే అంశంపై అధికారులు వారికి అవగాహన కల్పించి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో 108 బృందాలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాయి. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో కొన్నింటిని అధికారులు ఇప్పటికే పరిష్కరించారు.
ఇదీ చదవండి: Dalitha bandhu: శాలపల్లిలో భారీ బహిరంగ సభ.. మొదటి రోజు 2వేల కుటుంబాలకు.!