కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాల సంఖ్యను విస్తృతంగా పెంచాలని సూచించారు. అవసరమైన మేరకు ఆర్టీపీసీఆర్ కిట్లను తక్షణమే తెప్పించాలన్నారు. ప్రధానితో సమీక్ష అనంతరం కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాల సంఖ్యను విస్తృతంగా పెంచాలి: సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు
17:43 April 08
అర్హులందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయాలి: సీఎం కేసీఆర్
అన్ని విభాగాల ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వారంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో అర్హులందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులు సీఎంవోకు రోజూ రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మాస్కులు ధరించే నిబంధనను కఠినంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మాస్కు నిబంధనను విధిగా పాటించాలని ప్రజలను కోరారు.
ఇవీచూడండి:కరోనా 2.0: లాక్డౌన్ బాటలో రాష్ట్రాలు!