తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Meeting: మాదకద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా నేడు కీలక భేటీ - ts news

CM KCR Meeting: రాష్ట్రంలో మాదకద్రవ్యాల పూర్తి కట్టడికి ప్రభుత్వం మరింత కఠినంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్‌ అనే మాట కూడా వినిపించకూడదని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ అధికారులతో సమావేశమై మత్తు పదార్థాలు- వ్యవస్థీకృత నేరాల నియంత్రణ విధివిధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. డ్రగ్స్‌ కట్టడికి వెయ్యిమందితో ఏర్పాటుకానున్న ప్రత్యేక విభాగం, పనితీరుపై సమావేశంలో చర్చించనున్నారు.

CM KCR Meeting: మాదకద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా నేడు కీలక భేటీ
CM KCR Meeting: మాదకద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా నేడు కీలక భేటీ

By

Published : Jan 28, 2022, 4:05 AM IST

CM KCR Meeting: మాదకద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా నేడు కీలక భేటీ

CM KCR Meeting: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పోలీసు, ఆబ్కారీ సదస్సు జరగనుంది. హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సీఎస్​ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

ఎంతటివారైనా..

డ్రగ్స్ అనే మాటే రాష్ట్రంలో వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగించినట్లు తేలితే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని... రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠినచర్యలు తీసుకునేందుకు ఈ విభాగం.... డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ప్రత్యేక విభాగం ఏర్పాటు, విధివిధానాలు, పనితీరు సహా ఇతర అంశాలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ప్రత్యేక నిఘా

సీఎం ఆదేశాలతో గతంలోనే ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో క్వింటాళ్ల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 246 కేసులు నమోదు చేసి 2వేల కిలోల గంజాయి, 34 గ్రాముల కొకైన్, 41 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 602మందిని అరెస్టు చేయగా.. వీళ్లలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు నైజీరియన్లతోపాటు తరచూ గంజాయి విక్రయిస్తున్న 62మందిపై కేసు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 93 కేసులు నమోదు చేసి 175మందిని అరెస్ట్ చేశారు. 5,700కిలోల గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details