తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Review: 'తడిసిన ధాన్యాన్నీ కొంటాం.. సాధారణ ధాన్యం ధరే చెల్లిస్తాం'

CM KCR
CM KCR

By

Published : May 2, 2023, 5:03 PM IST

Updated : May 2, 2023, 10:25 PM IST

16:56 May 02

CM KCR Review: 'తడిసిన ధాన్యాన్నీ కొంటాం.. సాధారణ ధాన్యం ధరే చెల్లిస్తాం'

CM KCR Review on Paddy Collection: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ భవనంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటలు తడిసిపోవటంపై రైతులు ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా మొత్తం సేకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యానికి కూడా సాధారణ ధాన్యం ధరే చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. సాగు, రైతులను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గతానికి భిన్నంగా అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో యాసంగి పంటల ప్రణాళిక మార్చుకోవాలని సూచించారు. మార్చిలోపే కోతలు పూర్తయ్యేలా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కొత్త ప్రణాళికపై రైతుల్లో చైతన్యం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వరి కోతలను మరో 3, 4 రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని కేసీఆర్‌ రైతులకు సూచించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Last Updated : May 2, 2023, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details