కరోనా, వర్షాకాల వ్యవసాయం, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి చర్చించేందుకు ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలుపై చర్చిస్తారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.
ప్రస్తుతం హైదరాబాద్లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.