ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని... మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో సీఎం మరోసారి సమీక్ష నిర్వహించారు.
రైతుల శ్రేయస్సు కోసం...
కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోనందున రైతుల శ్రేయస్సు దృష్ట్యా... ప్రభుత్వ సంస్థలను గ్రామాలకు పంపి ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని సీఎం తెలిపారు. ధాన్యం ఎంత వస్తుందో పక్కా అంచనా వేసి, కొనుగోళ్ల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. బ్యాంకు గ్యారెంటీలు సహా... ధాన్యం అమ్మకం, డబ్బు వెంటనే చెల్లించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.