వానాకాలం పంటల కొనుగోలుపై శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమీక్షలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
మధ్యాహ్నం వానాకాలం పంటల కొనుగోలుపై కేసీఆర్ సమీక్ష - వానాాకాలం పంటల కొనుగోలుపై సీఎం సమీక్ష వార్తలు
వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత సాగు విధానంపై సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమీక్షించనున్నారు. పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రశ్నించనున్నారు. యాసంగిలో పంటల సాగుపై చర్చించనున్న సీఎం.. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రశ్నించనున్నారు. యాసంగిలో పంటల సాగుపై చర్చించనున్న సీఎం.. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది. యాసంగిలో మక్కల సాగు లాభమా? నష్టమా? మార్కెట్‌పై సమీక్షించనున్నారు. సమగ్ర వివరాలతో సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గతేడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? ఎంత ధర వచ్చిందో తెలపాలని కేసీఆర్ సూచించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ