CM KCR Released BRS MLAs Candidate List : రాష్ట్రప్రగతిని కొనసాగించాలనే అజెండాతోనే ఎన్నికలకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రకటించారు. ఇతర పార్టీలకు ఎన్నికలు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్(BRS)కు మాత్రం పవిత్ర యజ్ఞమని పునరుద్ఘాటించారు. 95 నుంచి 105స్థానాలు గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనని సీఎం అన్నారు. అక్టోబర్ 16న వరంగల్‌లో జరిగే సింహగర్జన వేదికగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని ప్రకటించారు. మజ్లిస్(Majlis)తో స్నేహం కొనసాగుతుందన్న కేసీఆర్.. 17ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.
అంసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాల్లో అభ్యర్థుల్ని(KCR announced 115 BRS candidates) ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ అజెండా, ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. కొత్త రాష్ట్రమైననప్పటికీ, వనరులు తక్కువగా ఉన్నప్పటికీ, అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ వజ్రంలా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. అభివృద్ధికి కొలమానంగా చూసే తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో నిలిచామని గుర్తుచేశారు. ఈ ప్రగతిని కొనసాగించాలనే అజెండాతో ఎన్నికలకు వెళుతున్నామని.. 95 నుంచి 105 స్థానాలు గెలుస్తున్నామని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు.
"ప్రగతి ఎజెండా ఇంకా ఏమీ లేదు. కొనసాగుతున్న ప్రగతి కొనసాగించండి. ఇతర పార్టీలకు ఏమో.. ఎన్నికలంటే పొలిటికల్ గేమ్. బీఆర్ఎస్కు ఎన్నికలు అంటే పవిత్రమైన యజ్ఞం. 95 నుంచి 105 స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాము."- కేసీఆర్, ముఖ్యమంత్రి
BRS MLAs First Phase List2023 : 9ఏళ్లలో మేనిఫెస్టోలో చెప్పని అనేక పథకాల్ని(Schemes) అమలుచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల ముంగిట రుణమాఫీ సహా వివిధ హామీలు అమలుచేయడంలో తప్పేంటని.. తమది మఠం కాదని రాజకీయపార్టీ అని తెలిపారు. అక్టోబర్ 16న వరంగల్‌లో జరిగే సింహగర్జన వేదికగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తామని వెల్లడించారు.