తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR in hyderabad: ముగిసిన కేసీఆర్ హస్తిన టూర్.. విపక్ష నేతలతో కీలక చర్చలు! - ముగిసిన దిల్లీ పర్యటన

CM KCR reached hyderabad: సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన ముగిసింది. వారం రోజుల పాటు దిల్లీలో పలువురు నేతలను కలిసిన ముఖ్యమంత్రి ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై విపక్షాల సీఎంలు, ఇతర రాష్ట్రాల నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కలిసి రావాలని ఇతర రాష్ట్రాల నేతలతో సమావేశమయ్యారు.

CM KCR
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/31-July-2022/15975674_54.jpg

By

Published : Jul 31, 2022, 3:54 PM IST

CM KCR reached hyderabad: వారం రోజుల దిల్లీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీలో పలువురు విపక్షాల నేతలను సీఎం కలిశారు. ఈనెల 25న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్​ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, జి.రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఉన్నారు.

అఖిలేశ్​తో కీలక భేటీ: యూపీకి చెందిన సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్​తో కేసీఆర్ సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై ఆయనతో చర్చించారు. ఇతర రాష్ట్రాల నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు అఖిలేశ్​తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్న భాజపాపై సమష్టిగా పోరాడేందుకు కలిసి రావాలని అఖిలేశ్​ను కోరినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details