తెలంగాణ

telangana

ETV Bharat / state

'నవంబర్​ 5 లోపు ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి' - CM KCR LATEST SPEECH ON TSRTC

"ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నాం. నవంబర్​ 5 అర్ధరాత్రి లోపు బేషరతుగా విధుల్లో చేరండి. అన్ని రకాలుగా మీకు మేం రక్షణ కల్పిస్తాం. యూనియన్ల మాయలో పడొద్దు. కేవలం స్నేహపూర్వక పోటీ వాతావరణం కోసమే ప్రైవేటు సంస్థల బస్సులను నడుపుతాం."- కార్మికులకు సీఎం కేసీఆర్​ పిలుపు

CM KCR PUT A DEADLINE FOR TSRTC EMPLOYEES TO JOIN IN DUTIES

By

Published : Nov 2, 2019, 10:07 PM IST

ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5 లోపు బేషరుతుగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్​ సూచించారు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశమిస్తున్నట్లు తెలిపిన సీఎం.... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటూనే.. ప్రైవేటు బస్సులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ నెరవేరిస్తే... మరో 91 కార్పొరేష‌న్లు విలీనం అడుగుతాయన్న కారణంతోనే... విలీనాన్ని మంత్రివర్గం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందని వెల్లడించారు. నవంబర్‌ 5 అర్ధరాత్రిలోపు విధుల్లోకి చేరని వారిని తర్వాత తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ కార్మిక కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు.నవంబర్‌ 5 తర్వాత పరిస్థితి చూసి మరో 5 వేల రూట్లను ప్రైవేటుకు ఇస్తామని సీఎం కేసీఆర్​ తెలిపారు.

'నవంబర్​ 5 లోపు కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలి'

ABOUT THE AUTHOR

...view details