తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో సీఎం ప్రెస్‌మీట్‌ ప్రస్తావన - kcr pressmeet issue in hc

CM KCR's press was mentioned in the High Court hearing of the case of baiting MLAs
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. హైకోర్టులో సీఎం ప్రెస్‌మీట్‌ ప్రస్తావన

By

Published : Dec 15, 2022, 3:43 PM IST

Updated : Dec 15, 2022, 4:21 PM IST

15:39 December 15

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ రేపటికి వాయిదా

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్‌ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. సీఎం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని భాజపా తరపు న్యాయవాది ప్రస్తావించారు. మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలను కోర్టుకు తెలిపారు. కీలకమైన కేసు దర్యాప్తు దశలో ఉండగానే వివరాలు బయటికి ఎలా వెళ్లాలని కోర్టు దృష్టికి పిటిషనర్ల తరపు న్యాయవాది తీసుకెళ్లారు.

ఈ కేసును ఏసీబీతో కాకుండా శాంతి భద్రతల విభాగం పోలీసులతో ఎలా దర్యాప్తు చేయిస్తున్నారని వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను ఏసీబీతోనే విచారణ చేయించాలనే నిబంధన ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్షన్ 17(బీ) ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి కూడా కేసు దర్యాప్తు చేసే అర్హత ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. అన్ని అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని రేపు తుది వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.

ఇవీ చూడండి:

Last Updated : Dec 15, 2022, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details