రాష్ట్రంలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు స్వీయ గృహనిర్బంధంలో ఉందామని సీఎం తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కూడా నడపమని స్పష్టం చేశారు. రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తిగా కరోనా కట్టడిలో పాలుపంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల బస్సులు కూడా రావొద్దని సీఎం ఉద్ఘాటించారు. ఇతర రాష్ట్రాల బస్సులను 24 గంటల పాటు రాష్ట్రంలోకి రానివ్వమన్నారు.
'జనతా కర్ఫ్యూ 14 గంటలు కాదు 24 గంటలు' - సీఎం కేసీఆర్ జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ ప్రబలకుండా ప్రధాని నరేంద్రమోదీ 14 గంటల జనతా కర్ఫ్యూను రాష్ట్రంలో 24 గంటల పాటు పాటిద్దామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రేపు ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని పేర్కొన్నారు.
!['జనతా కర్ఫ్యూ 14 గంటలు కాదు 24 గంటలు' Cm kcr press meet on janatha curfew](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6491616-thumbnail-3x2-df.jpg)
జనతా కర్ఫ్యూ