తెలంగాణ

telangana

ETV Bharat / state

'పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు'

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు నెలకొల్పే దిశగా తెరాస ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో ఇలాంటి స్నేహపూర్వక వాతావరణాన్నే తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత త్వరగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్​

By

Published : Jun 18, 2019, 9:10 PM IST

Updated : Jun 19, 2019, 6:22 AM IST

పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తామన్న కేసీఆర్​

పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. కేబినెట్​ భేటీ అనంతరం మాట్లాడిన ఆయన గత ప్రభుత్వాల హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్​లో ఉన్నాయని అన్నారు. లోయర్​ పెన్​గంగ ప్రాజెక్టు కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల విధానం అని దానిని ఆ పార్టీ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తి కావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తాము కోరిన వెంటనే ఏపీలో నూతన ప్రభుత్వం ఎలాంటి భేషజాలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు అప్పగించిందని చెప్పారు. ఇలాంటి సంబంధాలనే ఎల్లకాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Jun 19, 2019, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details