జలకళతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే నీటిపారుదల రంగ నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావుకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యాసాగర్‌రావు మూడో వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు.
రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణే నిజమైన నివాళి: సీఎం కేసీఆర్ - cm kcr
జలకళతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిన తెలంగాణ రాష్ట్రమే ఆర్.విద్యాసాగర్‌రావుకు నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్యాసాగర్‌రావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణే నిజమైన నివాళి: సీఎం కేసీఆర్
సమైక్య పాలనలో సాగునీటి రంగంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి.. విద్యాసాగర్‌రావు ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించారని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆశయాల మేరకు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. విద్యాసాగర్ రావు ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరించారని కొనియాడారు.