తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంటనే యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి: సీఎం కేసీఆర్​ - తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు

KCR Order To Open Yasangi Grain Purchase Centers: ఈ ఏడాదికి యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి కూడా అన్నే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు సీఎస్​ శాంతి కుమారి, సివిల్​ సప్లయ్ కమిషనర్​ అనిల్​ కుమార్​కు ఆదేశాలు జారీ చేశారు.

cm kcr
cm kcr

By

Published : Apr 9, 2023, 9:00 PM IST

KCR Order To Open Yasangi Grain Purchase Centers: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్​లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్​ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

రెండు రోజుల ముందు మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష: శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ ఆ శాఖ కార్యకలాపాలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది యాసంగిలో ధాన్యం కొనుగోలు.. సేకరణ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి చర్చించారు. ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజ సైతం వదులుకోబోమని.. అలాగే ఒక్క పైసా కూడా బయటకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. అక్రమాలకు తావు లేకుండా ఈసారి చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలకు పాల్పడుతూ.. డిఫాల్ట్​ మిల్లర్లు ఎక్కువగా ఉన్న నల్గొండ, వనపర్తి, మెదక్​, సూర్యాపేట, నిజామాబాద్​, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్​, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పటిష్ఠమైన టాస్క్​ఫోర్స్​ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశారు జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలన్నారు.

అదే విధంగా కొన్ని జిల్లాల్లో మిల్లర్లు అవినీతికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని గంగుల చెప్పారు. అలా చేసిన వారిపై ఇక నుంచి క్రిమినల్​ కేసులు పెట్టడానికి కూడా వెనకడుగు వేయమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్​ కృషితో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం 24 లక్షల మెట్రిక్​ టన్నుల మాత్రమే వరిని పండించేవారని.. కానీ ఇప్పుడు 141 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుతో పాటు మిల్లింగ్​ కెపాసిటీని కూడా పెంచాలని సూచించారు. ధాన్యం పక్కదారి పోకుండా చూసి.. సివిల్​ సప్లయ్​ శాఖకు ఫిర్యాదు చేసిన వ్యక్తులకు తగిన రివార్డు ఉంటుందని.. వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details