రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన హత్య.. మాటలకందని రీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తహసీల్దార్ విజయారెడ్డి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేరస్థులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం: కేసీఆర్
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం...
Last Updated : Nov 5, 2019, 2:03 AM IST