360 డిగ్రీల వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఆయన వ్యక్తిత్వ పటిమను వర్ణించడానికి మాటలు చాలవన్నారు. శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
పీవీ నరసింహరావు నిరంతర సంస్కరణ శీలి అని సీఎం పేర్కొన్నారు. సంస్కరణాభిలాషికి నిలువెత్తు నిదర్శనమన్నారు. పీవీ ఏ రంగంలో ఉంటే.. ఆ రంగంలో సంస్కరణలు తెచ్చారన్న ముఖ్యమంత్రి.. ఆయన జీవిత ప్రస్థానమంతా సంస్కరణలతో సాగిందని తెలిపారు. తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చెప్పిన మహా వ్యక్తి పీవీ అని కొనియాడారు.