తెలంగాణ

telangana

ETV Bharat / state

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం: సీఎం కేసీఆర్ - CM KCR ON KONDA LAXMANA BAPUJI BIRTH ANNIVERSARY

CM KCR pays tribute to Konda Laxman Bapuji: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శమని సీఎం కేసీఆర్‌ కీర్తించారు. బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, జీవితాంతం పోరాడిన ఆయన.. రాష్ట్రం గర్వించే గొప్ప నేత అని కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం ఘనంగా నివాళులర్పించారు.

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం: సీఎం కేసీఆర్
కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం: సీఎం కేసీఆర్

By

Published : Sep 27, 2022, 8:49 AM IST

CM KCR pays tribute to Konda Laxman Bapuji: బడుగు బలహీన వర్గాలు, తెలంగాణ సాధనకు జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్​ బాపూజీ.. తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కేసీఆర్​ కొనియాడారు. బాపూజీ జయంతి వేళ సీఎం కేసీఆర్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శమన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి, నిస్వార్థ సేవలను.. కేసీఆర్ స్మరించుకున్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే.. చాకలి ఐలమ్మ సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని సీఎం గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన, సహకార రంగాల పటిష్ఠతకు.. జీవితాంతం కృషి చేశారని తెలిపారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న ముఖ్యమంత్రి.. ఉద్యానవన విశ్వ విద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరిట అవార్డులు అందిస్తూ.. చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందని వివరించారు. సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు ప్రభుత్వం కార్యరూపం ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details