తెలంగాణ

telangana

ETV Bharat / state

Cm Kcr On Gellu: 'భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్‌కు వస్తావు' - Cm kcr on gellu

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు (Trs Candidate Gellu Srinivas Yadav) తెరాస అధినేత, సీఎం కేసీఆర్ (Cm Kcr) ప్రగతిభవన్​లో పార్టీ బీ- ఫారం అందజేశారు. బీ-ఫారంతో పాటు ఎన్నికల ఖర్చుల కోసం గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు పార్టీ ఫండ్​గా రూ.28 లక్షల రూపాయల చెక్కును సీఎం కేసీఆర్ అందచేశారు.

Cm kcr
హుజూరాబాద్ ఉపఎన్నిక

By

Published : Oct 1, 2021, 5:22 AM IST

‘హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో (Huzurabad By Election) తెరాస ఘన విజయం సాధిస్తుంది. భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్‌కు వస్తావు’ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ (Cm Kcr) ఆశీర్వదించారు. గురువారం రాత్రి ఆయన గెల్లుకు బి-ఫారం (B-form) అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీమంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ తెరాసకు కంచుకోట. అక్కడ పార్టీకి పటిష్ఠమైన పునాది ఉంది. వ్యక్తులుగా కాకుండా పార్టీగా ఎదిగిన నియోజకవర్గమది. అంకితభావంతో కార్యకర్తలు తమ భుజాలపై జెండా మోస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటులేదు. సంక్షేమ కార్యక్రమాలు, ప్రజారంజక పాలనే మన బలం. సర్వేలన్నీ తెరాస గెలుపునే ఖాయం చేస్తున్నాయి మరో పార్టీకి అక్కడ చోటే లేదు.

-- కేసీఆర్, ముఖ్యమంత్రి

ఈ సందర్భంగా హరీశ్‌, ప్రశాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, గెల్లు శ్రీనివాస్‌తో సీఎం పలు అంశాలపై చర్చించారు. తానూ ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటారని వెల్లడించినట్లు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధి కింద రూ.28లక్షల చెక్కు అందజేశారు.

ఇదీచూడండి:Election Notification 2021 : హుజూరాబాద్​, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details