రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీ జరగటం విచారకరం సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల వల్ల రైతులకు లాభాలతో పాటు, ఆహార కల్తీని నిరోధించవచ్చని సూచించారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ పెంపును కూడా పరిశీలిస్తున్నామని ఉద్ఘాటించారు.
'రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే అంశం పరిశీలనలో ఉంది' - కేసీఆర్
అప్పుడప్పుడు బాధ కలుగుతది అధ్యక్షా.. కొన్ని చోట్ల బియ్యం పట్టివేత అని అక్కడక్కడ వార్తలొస్తున్నాయి.. అది కూడా పోవాలంటే రేషన్ డీలర్లకు కమిషన్లు ఇచ్చే దానిలో ఇబ్బంది లేకుండా చూడాలి. ----- అసెంబ్లీలో సీఎం కేసీఆర్
అసెంబ్లీలో సీఎం కేసీఆర్