సీఏఏ, ఎన్‌పీఆర్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అసెంబ్లీ సమావేశాల్లో ఒకరోజు ప్రత్యేక చర్చ పెట్టాలని పేర్కొన్నారు. తాను ఊరిలో సొంతింటిలో పుట్టానని... ఆ రోజుల్లో జనన ధ్రువీకరణ పత్రాలు లేవని... ఇప్పుడు ఆయన్ను ఎవరైనా అడిగితే తానెక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు.
'నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు... నన్నడిగితే నేనెక్కడి నుంచి తేవాలె..
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక రోజు ప్రత్యేక చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఏఏ, ఎన్ఆర్సీపై మంత్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు
తన వద్దనే ధ్రువీకరణపత్రం లేదంటే.. తండ్రి సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. సీఏఏపై అక్బరుద్దీన్ ఓవైసీ కోరినట్లు ప్రత్యేకంగా చర్చిద్దామని స్పష్టం చేశారు. పాతబస్తీకి మెట్రోరైలు అనుసంధానం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:సీఏఏను ప్రస్తావించిన అక్బరుద్దీన్.. సమయం కాదన్న కేసీఆర్..
Last Updated : Mar 8, 2020, 6:16 AM IST