తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్ముడుపోయే పంటలే సాగు చేయాలి: కేసీఆర్​ - hyderabad latest news

రాష్ట్రంలో పంటల సాగు వ్యూహంపై 3 రోజులు విస్తృతంగా చర్చించారు సీఎం కేసీఆర్​. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలన్నారు. వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

cm kcr on agriculture in hyderabad
అమ్ముడుపోయే పంటలే సాగు చేయాలి: కేసీఆర్​

By

Published : Jun 3, 2020, 5:08 PM IST

ఈసారి వర్షాకాలం రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలే సాగుచేసే అలవాటు రైతుల్లో రావాలన్నారు. వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

నియంత్రిత సాగు ఏటా ప్రతి సీజన్‌లోనూ కొనసాగాలన్నారు. అమ్ముడయ్యే పంట వేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపారు. రైతు లాభం, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ ప్రయత్నాన్ని అధికారులు రైతుల సహకారంతో విజయవంతం చేయాలని కోరారు.

ఇవీ చూడండి:తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం

ABOUT THE AUTHOR

...view details