తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌తో రాకేశ్‌ టికాయత్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ! - kcr brs

సీఎం కేసీఆర్‌తో రాకేశ్‌ టికాయత్‌ భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశం జరిగింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్‌ రైతు ఎజెండా గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది.

CM KCR met Rakesh Tikayat
సీఎం కేసీఆర్‌తో రాకేశ్‌ టికాయత్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

By

Published : Jul 9, 2022, 7:40 AM IST

రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌సింగ్‌ టికాయత్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ సమావేశం జరిగింది. ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్‌ రైతు ఎజెండా గురించి విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు దేశ రాజకీయాలు, పంటలకు మద్దతు ధరలు, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలు, రైతుల సమస్యలు, వారికి ఆదాయం పెంపుదల విధానాలు, ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది.

రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, బీమా, వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌, ఊరూరా రైతు వేదికల ఏర్పాటు, రుణమాఫీ వంటి విధానాలపై టికాయత్‌ అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ సందర్భంగా టికాయత్‌ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతులకు పరిహారం పంపిణీ గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details