కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్డౌన్పై కీలక చర్చ - CM KCR REVIEW latest news
15:52 April 18
కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్డౌన్పై కీలక చర్చ
తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశానికి హాజరయ్యారు.
రేపటి మంత్రివర్గ భేటీ నేపథ్యంలో అన్ని అంశాలపై సీఎం సమీక్షిస్తున్నారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్, ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులపై రేపు మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిత్యావసరాలు, కిరాణా, మద్యం దుకాణాల అంశంపైనా వివిధ కోణాల్లో చర్చించినట్లు సమాచారం. అవసరాల మేరకు నిబంధనల సడలింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.